Monday, December 23, 2024

72 శాతం రేప్‌లకు శిక్షలే లేవు

- Advertisement -
- Advertisement -

దేశంలో మహిళలపై జరిగిన దారుణ అత్యాచారాల కేసుల్లో 30 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయంటే మన నేర ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఈ గణాంకాలే తె లియజేస్తున్నాయి. అత్యాచారాలు చేసిన 72 శాతం నిందితులు నేర వ్యవస్థలో డొల్లతనాన్ని అసరాగా చేసుకొని నిర్ధోషులుగా బయటపడు తున్నారు. ఈ నేపథ్యంలోనే కోల్‌కతా రేప్ కేసును చేపట్టడంలో మొదటి నుంచి జరిగిన తప్పులు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోంది. మంగళవారం (ఆగస్టు 27) కోల్‌కతా నగరం రోడ్లన్నీ విద్యార్థుల ఆందోళనలతో, పోలీస్‌ల ప్రతిఘటన చర్యలతో రణరంగంగా దద్దరిల్లింది. దీనికి కారణం దర్యాప్తులో జరిగిన తప్పు లు, వ్యవస్థలోని లోపాలు చివరకు మమతాబెనర్జీ రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు దారి తీస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఏటా 30,000 కు పైగా అత్యాచారాలు జరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమే కాకుండా, నేర న్యాయవ్యవస్థలోని పోలీస్, ప్రాసిక్యూషన్, కో ర్టులు, జైళ్లుఈ నాలుగు విభాగాల పనితీరులోని డొల్లతనాన్ని ప్రశ్నిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో డేటా ప్రకారం అత్యాచారాల కు పడిన శిక్షలు 2018 నుంచి 2022 వరకు 27 శాతం నుంచి 28 శాతం వరకే ఉన్నాయి. అంటే దేశంలో 72 శాతం అత్యాచార కే సు లు ఎలాంటి శిక్ష లేకుండానే ముగిసిపోయాయని చెప్పవచ్చు. అలాగే 2022లో బాలికలపై లైంగిక దాడి కేసులు 63 వేలకు పైగా నమోదయ్యాయి. అంటే దేశంలో ప్రతి పది నిమిషాలకు ఒక బాలికపై అత్యాచారం జరిగిందని తెలుసుకోవచ్చు. ఇన్ని జరుగుతున్నా నేరవ్యవస్థలోని నాలుగు విభాగాలు పోలీస్, ప్రాసిక్యూషన్, కోర్టులు, జైళ్లు త మ విధుల్లో సామూహిక వైఫల్యం చెందితే నేరస్థుల హృదయాల్లో శిక్ష అంటే ఏమాత్రం భయం ఉండదు. నేరాలను దర్యాప్తు చేసేది మొ దట పోలీసులే.

తమ దర్యాప్తులో ఎలాంటి దౌర్బల్యాలకు చోటీయరాదు. దీనికోసం మొదట క్రైమ్‌సీన్‌ను పరిరక్షించుకోవాలి. దీనివల్ల నిపుణులు సాక్షాలను సరైన విధానంలో సేకరించ గలుగుతారు. దర్యాప్తు ప్రారంభదశలో నేరం నమోదు ఆలస్యమైతే తప్పు చే సినట్టే. కోల్‌కతా వైద్య విద్యార్థిని కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు 14 గంటలు ఆలస్యమైంది. అంతేకాకుండా క్రైమ్‌సీన్‌ను రక్షించకుండా ధ్వంసం చేశారు. దీంతో అనేక అనుమానాలు పెరిగి దర్యాప్తునే శంకించ వలసిన పరిస్థితి ఏర్పడింది. బద్లాపూర్ కేసులో కూడా ప్రజల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్న తరువాత పోలీస్‌లు దర్యాప్తుకు రంగంలో దిగారు. ఎఫ్‌ఐఆర్ నమోదులో వాంగ్మూలాలు రికార్డు చేయడంలో విపరీతమైన జాప్యం చేయడంపై బొంబాయి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తరువాత క్రైమ్‌సీన్ నుంచి బలమైన సాక్షాలను సేకరించడం, పరిశోధకుల పాత్ర, అత్యంత ప్రాధాన్యమైనవి. పోలీస్‌లు దర్యాప్తు పకడ్బందీగా నిర్వహించి సకాలంలో సంపూర్ణ న్యాయం అందేలా చూడవలసిన బాధ్య త రాష్ట్రాలదే. కానీ ఘరానా కేసులు ప్రజాందోళనల తరువాత ఎందు కు సిబిఐకి బదిలీ అవుతుంటాయి? అని ప్రశ్నించుకుంటే ఆయా రాష్ట్రాల దర్యాప్తు తీరుపై నమ్మకం లోపించడమే.

దర్యాప్తు సరిగ్గా లే కుంటే ప్రాసిక్యూషన్‌కు కోర్టు విచారణల్లో అప్పీళ్లలో లీగల్ ప్రొసీడింగ్‌లో ప్రతిదశలో సమస్యలు ఎదురవుతాయి. చివరకు అత్యాచార నేరస్థులు చట్టం నుంచి తప్పించుకుని దర్జాగా బయటకు వెళ్లిపోతా రు. ప్రాసిక్యూషన్ నేరస్థులకు శిక్షపడేలా చేసినా, శిక్ష అమలులో విపరీతమైన జాప్యం చేస్తే బాధితులకు సకాలంలో న్యాయం అందించలేని వారవుతారు. 2012 ఢిల్లీ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు గ్యాంగ్ రేప్ నేరస్థులకు ఏడాదిలోగా విచారించి ఉరిశిక్ష విధించింది. కానీ నేరస్థులకు ఏడేళ్లకు కానీ ఉరిశిక్షఅమలు కాలేదు. దేశంలో నేరన్యా య వ్యవస్థ పునస్సమీక్షించిన తరువాత క్రూరమైన కేసుల్లో ఏడేళ్లు అంతకు మించి శిక్షపడనున్న కేసుల్లో ఫోరెన్సిక్ పరీక్షలు తప్పనిసరి చేశారు. 12 ఏళ్ల కన్నా తక్కువ వయసు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే జీవితకాల శిక్షలేదా మరణశిక్ష పడుతుంది. ఈ కేసుల్లో ఫోరెన్సిక్ బృందం పరీక్షలను విస్తృతం చేశారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత 2024 ఫోరెన్సిక్ పరీక్షలో వీడియోటేప్ రికార్డింగ్ తప్పనిసరిగా చేయాలన్న నిబంధన విధించారు.

ఫిర్యాదుల పరిశీలనకు, ఛార్జిషీట్ల దాఖలుకు గడువు నిర్ణయించారు. మహిళలపై కేసు ల విషయం లో ఎలెక్ట్రానిక్ ఎఫ్‌ఐఆర్ సిస్టమ్ ప్రవేశ పెట్టారు. దర్యా ప్తు సంస్థలు తమ విధిని సక్రమంగా సకాలంలో నెరవేర్చగలిగితేనే ఈ న్యాయ సంస్కరణలు సత్ఫలితాలు అందిస్తాయి. కానీ ప్రాథమిక దర్యాప్తులో వైఫల్యం , ఫోరెన్సిక్ సాక్షాల సేకరణలో అసంపూర్తి లేదా ఆలస్యం , ఇవన్నీ చివరకు బాధితులకు న్యాయం లభించడం కష్టతరం చేస్తున్నాయి. కాబట్టి దర్యాప్తు సంస్థ క్రైమ్‌సీన్‌ను పరిరక్షించడం, సాక్షాలను సమగ్రంగా సేకరించడం అత్యంత అవసరం. అప్పుడే కేసు బలంగా ఉండి నిందితులకు శిక్షపడుతుంది. ఈ చర్యలన్నీ మహిళలపై జరిగే నేరాలను పూర్తిగా నివారించలేక పోయి నా, నేరగాళ్ల మనసులో భయం కలిగిస్తాయనడం వాస్తవం. అలాగే బాధితులు, వారి కుటుంబీకులు న్యాయం కోసం సుదీర్ఘకాలం నిరీక్షించవలసిన అగత్యం ఉండదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News