Sunday, December 29, 2024

మెట్రోలో రీల్స్ వద్దంటూ ఢిల్లీ మెట్రో చురకలు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: మెట్రోలో ప్రయాణిస్తూ డ్యాన్సులు, ఇతర వింత చేష్టలతో రీల్స్ తీస్తున్న కొందరి ప్రవర్తన పట్ల ఢిల్లీ మెట్రో విసిగిపోయినట్లుంది. అలాంటి చేష్టలపై అభ్యంతరం తెలియచేస్తూ వినూత్న రీతిలో ఒక వ్యంగ్య సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే రీతిలో ప్రవర్తించవద్దంటూ ఇప్పటికే పలుమార్లు మెట్రో ప్రయాణికులకు ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. అయినా ప్రయాణికులలో మార్పు రాలేదు. దీంతో మెట్రోలో రీల్స్ చేయడం వల్ల సహ ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని వర్ణిచండానికి వ్యంగ్యాస్త్రాన్ని ఢిల్లీ మెట్రో ఎంచుకుంది.

మెట్రోలో ప్రయాణించండి కాని ఇతులకు ఇబ్బంది పెట్టకండి అంటూ ఈ పోస్టుకు శీర్షిక పెట్టింది. మూడు తలలు వేసి వాటిపై మైగ్రేన్ హైపర్‌టెన్షన్, స్ట్రెస్ అని రాసింది. చివరన మెట్రోలో ఎవరైనా డ్యాన్స్ చేయడం చూస్తే కలిగే సమస్యలు అన్న అర్థం స్ఫురించే రీతిలో ఈ పోస్టు ఉంది. ఢిల్లీ మెట్రో పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఇప్పటి వరకు 8 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ సందేశాన్ని మరింత బలంగా వ్యాప్తి చేయాలని కొందరు కామెంట్ చేయగా తోటి ప్రయాణికులకు అసౌకర్యం కల్పించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఢిల్లీ మెట్రోకు కొందరు సలహా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News