Friday, December 20, 2024

టికెట్ క్యాన్సలేషన్‌తోనూ భారత రైల్వేకు రెట్టింపు ఆదాయం!!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రైల్వే టికెట్ క్యాన్సలేషన్ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక రూపంలో పెంచుతూనే ఉంది. అందుకే ఏటా టికెట్ క్యాన్సలేషన్ ద్వారా ప్రయాణికులకు వాటిల్లుతున్న నష్టం క్రమంగా పెరుగుతోంది. టికెట్ల క్యాన్సలేషన్ ద్వారా 2019లో రైల్వేకు 352 కోట్లు మిగిలితే.. గత ఏడాది అది రూ.694.08 కోట్లకు ఎగబాకింది. అంటే రెండళ్లలో టికెట్ల క్యాన్సలేషన్ ద్వారా ప్రయాణికుల జేబులకు పడే చిల్లు రెట్టింపు అయ్యింది. రైల్వే టికెట్ క్యాన్సలేషన్ ఛార్జీల పెంపు ద్వారా ఏడాదికి అదనంగా వస్తున్న ఆదాయం 342 కోట్ల కావడం గమనార్హం. ఉదా.. టికెట్ క్యాన్సలేషన్ ద్వారా ద.మ.రైల్వేకు వస్తున్న ఆదాయాన్ని ఓ సారి పరిశీలిస్తే ..2019-20లో క్యాన్సలేషన్ ఫీ కలెక్ట్ చేసిన మొత్తం 352.33 కోట్లు కాగా , 2020-21 సంవత్సరంలో రూ. 299.17 కోట్లు, 2021-22లో 694.08 కోట్లు కాగా 2022-23 (డిసెంబర్ నాటికి) అది రూ. 604.40 కోట్లను క్యాన్సలేషన్ ఫీ కలెక్ట్ ద్వారా సంపాదించుకుంది.

కాగా ఈ దఫా కేంద్ర బడ్జెట్‌లో దివ్యాంగుల పెన్షన్ బడ్జెట్‌ను కేవలం రూ. 290 కోట్లు మాత్రమే కేటాయించడం కొస మెరుపు. కాగా ట్రైన్ టికట్ క్యాన్సలేషన్ ఛార్జీలు 2015 నవంబర్ 11 కంటే ముందు స్వల్ప స్థాయిలో ఉండేవి. ఆ తరువాత రైల్వే శాఖ వాటిని రెట్టింపు చేసింది. ఈ క్రమంలోనే సామాన్యుడి జేబుకు చిల్లులు పడేలా ఈ క్యాన్సలేషన్ ఛార్జీలు ఉన్నాయి. కాగా ట్రైన్ టికెట్ క్యాన్సలేషన్ ఛార్జీలు బుకింగ్ స్టేషన్‌ను బట్టి, తరగతిని బట్టి ఉంటాయి. అలాగే ప్రయాణానికి ఎంత ముందుగా రద్దు చేసుకున్నారన్న దానిని బట్టి కూడా ఛార్జీలు ఉంటున్నాయి.

వెయిటింగ్, ఆర్‌ఏసి అయితే ఇలా…

మీరు బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే.. ఒక వేళ బుకింగ్ స్టేటస్ వెయిటింగ్ లిస్ట్ అని గానీ, ఆర్‌ఏసి అని గానీ ఉంటే క్యాన్సలేషన్ ఛార్జీగా కేవలం లెవీ ఆఫ్ క్లర్కేజీ మాత్రమే కట్ చేస్తారు. ఈ లేవీ ఎంత ఉంటుందంటే అన్ రిజర్వ్‌డ్ అయితే రూ. 30 స్లీపర్ తదితర ఇతర రిజర్వ్‌డ్ తరగతులు అయితే రూ. 60 కోత విధిస్తారు. ఆర్‌ఏసి టిక్కట్‌పై ప్రారంభ సమయానికి అరగంట ముందు వరకు రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కన్ఫమ్ అయి కొన్ని వెయిట్ లిస్ట్‌లో ఉంటే సైతం ప్రయాణం ప్రారంభానికి ముందు అరగంట వరకు క్యాన్సలేషన్ చేసుకోవచ్చు. వీటన్నింటికీ కేవలం రూ. 60 లేవీ విధిస్తారు. అయితే రైల్వే కన్ఫర్మ్ టికెట్ అయితే క్యాన్సలేషన్ ఛార్జీలు ఇలా ఉండనున్నాయి. రిజర్వ్‌డ్ టికెట్లు కన్ఫమ్ అయి ఉంటే గనుక వాటిని క్యాన్సిల్ చేసుకున్నప్పుడు రెండు రకాలుగా కోత ఉంటుంది.

ఒక వేళ ప్రయాణ సమయానికి 48 గంటల ముందుగా రద్దు చేసుకుంటే ఒక్కో ఫ్యాసింజర్‌కు తరగతిని బట్టి వేర్వేరుగా ఉంటుంది. 48 గంటల ముందు రద్దు చేసుకుంటే ఫస్ట్ ఏసి లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ అయితే గనుక ఒక్కో ప్రయాణికుడికి రూ. 240 ఛార్జీ కోత విధిస్తారు. ఇక సెకండ్ ఎసి లేదా ఫస్ట్ క్లాస్ అయితే రూ. 200 కోతను విధిస్తారు. అదే థర్డ్ ఏసి, లేదా ఏసిసి, లేదా 3ఏ ఎకానమి క్లాసెస్ అయితే టికెట్ క్యాన్సలేషన్ ఛార్జీలు రూ. 180 కోత విధిస్తారు. స్లీపర్ క్లాస్ అయితే ఒక్కో ప్రయాణికుడికి రూ. 120 కోత విధిస్తారు. సెకండ్ క్లాస్ అయితే రూ. 60 కోత విధిస్తారు.

12 గంటల ముందయితే ఇలా..

కాగా రైల్వే ప్రయాణానికి 12 గంటల ముందు నుంచి అయితే 48 గంటల లోపు వరకు క్యాన్సలేషన్ ఛార్జీలు మరో రకంగా ఉంటాయి. టిక్కెట్ ఛార్జీలో ఏకంగా 25 శాతం మేర కోత విధిస్తారు. కాగా కేవలం 4 గంటల ముందు అయితే మరోలా ఉంటోంది. ఒక వేళ ప్రయాణానికి 4 గంటల ముందు క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం టికెట్ ఛార్జీలో 50 శాతం మేర క్యాన్సలేషన్ ఛార్జీగా కోత విధిస్తారు. ఇక నాలుగు గంటల కంటే తక్కువ సమయం ఉంటే ఎలాంటి రీఫండ్ దక్కదు. కాబట్టి రైలు ప్రయాణాలు చేసేటప్పుడు టికెట్ క్యాన్సలేషన్ చేసుకోకుండా జాగ్రత్తగా ప్రయాణాల సమయాన్ని ఖరారు చేసుకుని ప్రయాణాలు చేయడం మంచిది. లేదంటే ప్రయాణాలు రద్దు చేసుకోవడం అదీ.. ఓ నాలుగు గంటల కంటే తక్కువ సమయం ఉంటే ఎలాంటి రీఫండ్ దక్కదన్నది గమనంలో ఉంచు కోవడం మరువరాదని రైలు ప్రయాణికులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News