- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో కందిపప్పు, మినప్పప్పు దిగుమతిపై 2025 మార్చి వరకు ఎటువంటి ఆంక్షలూ ఉండవని ప్రభుత్వం గురువారం నిర్దంద ప్రకటన చేసింది. వాటి దేశీయ సరఫరా పెంచేందుకు, వాటి ధరలను అదుపులో ఉంచేందుకు కృషిలో భాగంగా వాటి దేశీయ సరఫరా పెంపుదల, ధరల నియంత్రణకు చేస్తున్న కృషిలో భాగంగా ఆంక్షలు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం వెల్లడించింది. కందిపప్పు, మినప్పప్పులను ఫ్రీ కేటగరీలో ఉంచడమైంది. అంటే వాటి దిగుమతులపై ఎటువంటి ఆంక్షలూ ఉండబోవన్న మాట. ‘మినప్పప్పు, కందిపప్పు ఉచిత దిగుమతి విధానాన్ని 2025 మార్చి వరకు సొడిగించినట్లు విదేశీ వాణిజ్యం డైరెక్టర్ జనరల్ ఒక ఉత్తర్వులో తెలియజేసింది. ప్రస్తుతం ఆ పప్పు ధాన్యాల ఉచిత దిగుమతి విధానాన్ని 2024 మార్చి వరకు అమలులో ఉన్నది.
- Advertisement -