- Advertisement -
న్యూఢిల్లీ : రాజకీయాలలో రిటైర్మెంట్లు అంటూ ఉండవు బాబూ అంటూ అజిత్ పవార్‌కు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ చురకలు అంటించారు. శరద్ పవార్‌కు వయస్సు మీదపడిపోతోందని, ఇంకా ఎందుకు రాజకీయాలని అజిత్ పవార్ పేర్కొనడంపై లాలూ తనదైన రీతిలో స్పందించారు. వయస్సు పెరిగేకొద్ది రాజకీయాల్లో అనుభవం మరింతగా పండుతుంది. రాజకీయాలకు వయస్సుకు జోడి కుదర్చడం కుదరదని లాలూ తేల్చిచెప్పారు. ఎవరో ఏదో చెప్పారని ఎవరైనా రాజకీయాల నుంచి వైదొలుగుతారా? ఇదేమైనా తమాషానా అని దాదాపుగా శరద్ పవార్ వయస్సు ఉండే లాలూ ఇక్కడ తెలిపారు. వైద్య పరీక్షలు సాధారణ చికిత్సకు లాలూ ఢిల్లీకి వచ్చారు.
- Advertisement -