Monday, December 23, 2024

బిజెపితో మళ్లీ కలిసే ప్రసక్తే లేదు: నితీశ్ కుమార్

- Advertisement -
- Advertisement -

పాట్నా: తాను చావనన్న చస్తాను కానీ బిజెపితో పొత్తుపెట్టుకోనని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. తన ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై కావాలని, ఎలాంటి ఆధారం లేకుండా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తాను ప్రధాని నరేంద్ర మోడీ ట్రస్ట్‌ను దుర్వినియోగం చేస్తున్నానని బిజెపి నాయకులు ఆరోపించడానికి స్పందిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు. ఈ సందర్భంగానే ఆయన బిజెపితో మళ్లీ కలిసే ప్రసక్తే లేదన్నారు.

తేజస్వీ యాదవ్, ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై అవినీతి కేసులున్నందున్న తిరిగి బిజెపితో పొత్తుకుంటారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ స్పష్టీకరణ ఇచ్చారు. ‘జాగ్రత్తగా వినండి, వారు నన్ను ఒప్పించడానికి తెగ ప్రయత్నం చేశారు. వారు తేజస్వీ యాదవ్, ఆయన తండ్రి లాలూపైన కేసులు పెట్టారు. ఇప్పటికీ వారు నన్ను కలుపుకోవాలని యత్నిస్తున్నారు. వారు అలా చేస్తూనే ఉంటారు’ అని నితీశ్ కుమార్ తెలిపారు.

రానున్న ఎన్నికల్లో బీహార్‌లోని 40 లోక్‌సభ సీట్లలో 36 గెలుచుకుంటామని బిజెపి చెప్పుకోవడాన్ని ఆయన కొట్టిపారేశారు. వారు ఇదివరలో పొత్తుపెట్టుకున్నప్పుడు ముస్లింలు సహా అన్ని వర్గాల మద్దతును పొందారు. కానీ వారందరికీ ఇప్పుడు బిజెపి హిందూత్వ భావజాలం ఏమిటో బాగా అర్థమైపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News