Sunday, October 20, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం 5 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతున్నది. ఇక, శనివారం శ్రీవారిని 80,741 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 31,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

కాగా, ఆన్‌లైన్‌లో జనవరి నెల ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల అయ్యాయి. రేపు మధ్యాహ్నం లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News