- Advertisement -
చండీగఢ్ : ప్రభుత్వ ఉద్యోగులు నెలనెలా జీతాలు తీసుకోవాలంటే తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించాలని పంజాబ్ ప్రభుత్వం నిబంధన విధించింది. రెండు డోసులైనా, ఒక డోసు తీసుకున్నా ఆ సర్టిఫికెట్‌ను ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని , అప్పుడే జీతం వస్తుందని స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు వ్యాక్సినేషన్ జోలికి వెళ్లని ఉద్యోగుల విషయంలో ఎలాంటి చర్యలు చేపడతారో తన ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదు.
- Advertisement -