Thursday, January 23, 2025

బాబుకు ఓటేస్తే పథకాలు ఉండవు: జగన్

- Advertisement -
- Advertisement -

మాచర్ల: సిఎం జగన్‌కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, ఇంటింటా అభివృద్ధి ఉంటుందని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. పొరపాటున టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే పథకాలు ఉండవని, చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుందని, లక లక అంటూ మీ ఇంటి గడపతొక్కుతుందని, సాధ్యం కాని హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడన్నారు. మాచర్లలో సిఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రచార సభకు జనం పోటెత్తారు. జనంతో మాచర్ల రహదారులు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్‌ను తెలియజేస్తాయని వివరించారు.

130 సార్లు బటన్ నొక్కి వివిధ పథకాలు ద్వారా మంచి చేశామని, 2.7 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో వేశామని, 2.3 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించామని, మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే రోజులు గతంలో చూశామని, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామని, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో మూడో తరగతి నుంచి టోఫెల్ క్లాసులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ స్కూళ్లలో ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన ఉందని, విద్యార్థులకు బైలింగువల్ టెక్ట్ బుక్స్, బైజూస్ కంటెంట్ అందిస్తామని, బడులు తెరిచే నాటికే విద్యాకానుక, గోరుముద్ద, అమ్మఒడి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా ఏర్పాటు చేశామన్నారు.

విద్యారంగంలో తాము చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా? అని ప్రశ్నించారు. అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాసునేస్తం, ఇబిసి నేస్తం ఉందన్నారు. అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, అవ్వాతాతలకు ఇంటి వద్దకే మూడు వేలపెన్షన్ ఇస్తున్నామని, ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయని, జగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం, మత్సకార భరోసా, లా నేస్తం, వాహనమిత్ర ద్వారా ఆదుకున్నామని జగన్ గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News