Friday, December 20, 2024

టెస్లాకు ప్రత్యేక పాలసీ ఏమీలేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికా ఎలక్ట్రిక్ కారు తయారీ సంస్థ టెస్లాకు ఎలాంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనాలకు ప్రస్తుతం ఇస్తున్న పిఎల్‌ఐ(ఉత్పత్తి ఆధారిత పథకాలు) కింద టెస్లాకు సహకారం ఉంటుందని, కానీ అమెరికా కంపెనీ కోసం ఎలాంటి ప్రత్యేక విధానాలు ఉండబోవని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఎసిసి(అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్) బ్యాటరీ నిల్వ కోసం ప్రభుత్వం పిఎల్‌ఐ ప్రారంభించింది.

వాహన, పరికరాలు, డ్రోన్ పరిశ్రమ కోసం రూ.18,100 కోట్లు, రూ.26,058 కోట్ల పిఎల్‌ఐ పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. ‘ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఇప్పటికే పథకాలు ఉన్నాయని టెస్లాకు వివరించాం, వారు కూడా దరఖాస్తు చేయవచ్చు. దీనిని వారు స్వాగతించారు. విధానాలు అందరికీ ఒకే విధంగా ఉంటాయి, ఏ ఒక్కరి కోసం ప్రత్యేక పాలసీలను రూపొందించం. ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఎలాంటి విధానాలు చేపట్టలేదు’ అని అధికారి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News