Wednesday, January 22, 2025

బీహార్‌కు ప్రత్యేక హోదా… ఆ ప్రతిపాదన ఏదీ లేదన్న కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని తాజాగా కేంద్రం వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యం లోనే ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. బీహార్‌తోపాటు వెనుకబడిన రాష్ట్రాలకు అభివృద్ధి , పారిశ్రామికీకరణను ప్రోత్సహించడానికి ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా? అని జేడీయు ఎంపీ రామ్‌ప్రిత్ మండల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను ప్రశ్నించారు.

దీనికి ఆ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ వేదికగా వెల్లడించడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఎన్డీయే కూటమిలో జేడీయు భాగస్వామ్యం కీలకంగా మారింది. 12 మంది సభ్యుల బలంతో కూటమిలో మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. ఈనేపథ్యంలో ప్రత్యేక హోదా ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇది తమ పార్టీ ప్రథమ ప్రాధాన్యం అని జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఇటీవల వెల్లడించారు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రానికి ఏదైన సమస్య ఉంటే తాము ప్రత్యేక ప్యాకేజీని కోరతామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News