- Advertisement -
బీహార్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జెడియూ-బిజేపీ కూటమీ నేతృత్వంలోని ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనుంది. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మరికాసేపట్లో నితీష్ ప్రభుత్వంపై బలపరీక్ష జరగనుంది. అయితే, విశ్వాస పరీక్షలో జెడియూ-బిజేపీ కూటమీ నెగ్గే అవకాశ ఉంది.
బీహార్ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 243. మెజారిటీ లక్షం 122. ఎన్‌డిఎకు 128 మంది సభ్యులతో సుఖప్రదమైన ఆధిక్యం ఉంది. వారిలో 78 మంది బిజెపి సభ్యులు. జెడి(యు)కు 45 మంది, హిందుస్థానీ అవమ్ మోర్చా (హెచ్‌ఎఎం)కు నలుగురు సభ్యులు ఉన్నారు.
- Advertisement -