Sunday, December 22, 2024

రైలు టాయిలెట్‌లో నీళ్లు లేవు…. అర్జంట్ ప్లీజ్….

- Advertisement -
- Advertisement -

 

 

న్యూస్ డెస్క్: బస్సులో ప్రయాణించే వారు అర్జంట్‌గా టాయిలెట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు అనుభవించే నరకయాతన వర్ణించనలవి కాదు. అదే రైలు ప్రయాణంలో ఈ పరిస్థితి సామాన్యంగా ఎదురుకాదు. కాని..రైలులో కూడా ఇటువంటి పరిస్థితే ఎదురైతే ఎలా..అరుణ్ అనే ప్రయాణికుడికి అర్జంట్‌గా టాయిలెట్‌కు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. తీరా చూస్తే టాయిలెట్‌లో నీళ్లు లేవు..ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా అయింది అతని అవస్థ. అప్పుడు అతను సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో నవ్వులు పూయించింది. నెటిజన్లు అరుణ్‌ని ఓ ఆట ఆడుకున్నారు.

ఢిల్లీ నుంచి ప్రతాప్‌గఢ్ వెళ్లే పద్మావత్ ఎక్స్‌ప్రెస్ ఘజియాబాద్ రైల్వే స్టేషన్‌ను చేరుకున్న సమయంలో అరుణ్‌కు అర్జంట్ టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చింది. టాయిలెట్‌లో నీళ్లు లేకపోవడంతో అతను కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి కనపడలేదు. దీంతో అతను టాయిలెట్‌లో నీళ్లు లేని విషయాన్ని ట్విటర్‌లో ట్వీట్ ద్వారా సేవ దృష్టికి తీసుకు వెళ్లాడు. తాను పళ్లబిగువున భరిస్తున్నానని, వెంటనే టాయిలెట్‌లో నీళ్లు రప్పించి పుణ్యం కట్టుకోవాలంటూ అతను ట్వీట్ చేశాడు. కొద్ది సేపట్లో స్పందించిన రైల్వే అధికారులు మీ ట్రెయిన్ నంబర్, పిఎన్‌ఆర్ నంబర్ తెలియచేయాలని, సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మరో గంటకు భారతీయ రైల్వేలకు ధన్యవాదాలు తెలియచేస్తూ అరుణ్ మరో ట్వీట్ పోస్ట్ చేశాడు. అతడి సమస్య పరిష్కారమైందని దీన్నిబట్టి భావించాల్సి ఉంటుంది. అయితే అరుణ్ పోస్టు చేసిన మొదటి ట్వీట్‌కు నెటిజన్ల నుంచి సరదా స్పందనలు వ్యక్తమయ్యాయి. బిస్లరీ వాటర్ బాటిల్‌తో పని కానిచెయ్యమని ఒక నెటిజన్ సలహా ఇవ్వగా ఇతను నీళ్లను వృథా చేస్తున్నాడు..ఇతనిపై చర్యలు తీసుకోండి అంటూ మరో ట్విట్టరైట్ కామెంట్ చేశాడు. అరుణ్ చాలా సంకటమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని, అతనికి తాను మద్దతు ఇస్తున్నానంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇలా పలువురు నెటిజన్ల కామెంట్లతో ట్విటర్ సందడి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News