Monday, December 23, 2024

వేతనాలు నిలుపుదల చేయటం లేదు : షఫీ ఉల్లా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉద్యోగుల వేతనాలు నిలుపుదల చేయడం లేదని మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి షఫీ ఉల్లా స్పష్టం చేశారు. టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, పత్రిక సంపాదకులు పి మాణిక్ రెడ్డి మంగళవారం సాయంత్రం షఫీ ఉల్లాను కలిసి వేతనాలు నిలుపుదల ఆదేశాలను ఉపసంహరించుకోవాలని వినతిపత్రం సమర్పించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ, ఎవరి జీతం నిలుపుదల చేయటం లేదని, కేవలం అడ్మిషన్లు, హాజరు పెంచుకోవటానికి మాత్రమే హెచ్చరించామని స్పష్టం చేశారు. ప్రిన్సిపాల్స్ కు మార్చి నుండి ఇవ్వాల్సిన వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయటానికి, రీజనల్ కోఆర్డినేటర్ ఖాళీల్లో సీనియర్ ప్రిన్సిపల్స్ ను నియమించటానికి షఫిఉల్లా అంగీకరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News