న్యూఢిల్లీ: రెండో తరగతి వరకూ పిల్లలకు రాత పరీక్షలు వద్దని మూడో తరగతి నుంచి రాత పరీక్షలు ప్రవేశపెట్టాలని ఎన్‌సిఎఫ్ ముసాయిదా సిఫార్సు చేసింది. తద్వారా ఎలాంటి అదనపు భారం పడదని నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సిఎఫ్) తెలిపింది. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఇపి) ఫ్రేమ్‌వర్క్ ప్రకారంప్రాథమిక దశలో పిల్లలు పరిశీలన, అభ్యాస అనుభవంపై దృష్టి సారించాలని ప్రాథమిక దశ స్కూల్ నుంచి రెండో తరగతి వరకు) పరీక్షలు, మూల్యాంకన సాధనాలు తగవని ముసాయిదా పేర్కొంది. సన్నాహక దశ తరగతి నుంచి 5వ తరగతి)ను వివరిస్తూ ఈ దశలో రాత పరీక్షలను ప్రవేశపెట్టాలని ఎన్‌సిఎఫ్ సిఫార్సు చేసింది. పిల్లల విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడానికి అనేక రకా మూల్యాంకన పద్ధతులను ఉపయోగించాలి.
విద్యార్థుల పురోగతి సంపూర్ణంగా సంగ్రహించడానికి ఉపయోగించవచ్చు. ఇది విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకాన్ని అందిస్తోందని తెలిపింది. కాగా కేంద్ర విద్యామంత్రిత్వశాఖ గురువారం పాఠశాల విద్యకోసం ఎన్‌సిఎఫ్ ప్రి డాఫ్ట్‌ను విడుదల చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పండితులు, విద్యావర్గాల నుంచి సూచనలను ఆహ్వానించింది. ఇస్రో మాజీ చీఫ్ కె కస్తూరిరంగన్ నేతృత్వంలోని పానెల్ రూపొందించిన ముసాయిదా ప్రకారం దశ (6నుంచి 8వ తరగతి వరకు) పాఠ్య ప్రణాళిక శ్రేణి సామర్థాలతో ఉండాలని సూచించింది. సెకండరీ దశ (9వ తరగతి నుంచి అర్థవంతమైన అభ్యాసం సులభతరం చేయడానికి మూల్యాంకాలను సమర్థవంతం నిర్వహించాలని ప్యానెల్ స్పష్టం చేసింది.