Friday, November 22, 2024

సర్వే కోసం ఎలాంటి జిరాక్సులు అవసరం లేదు: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కోటి 17 లక్షల 44 వేల ఇండ్లు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జిహెచ్‌ఎంసి హెడ్ ఆఫీస్‌లో బల్దియాలో సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. ప్రారంభం సర్వే కోసం 87,900 ఎన్యుమరేటర్లను నియామకం చేశామని, మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కర్ అంటిస్తామని, డోర్ లాక్ ఉంటే మరోసారి సర్వే వివరాలు సేకరిస్తామని, సర్వే ద్వారా వచ్చే డేటాతో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

సర్వేను కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. సర్వేలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలని కోరారు. ఆధార్ కార్డు వివరాలు అప్షనల్ మాత్రమేనని పొన్నం తెలియజేశారు. సర్వే కోసం ఎలాంటి జిరాక్సులు అవసరం లేదన్నారు. గ్రేటర్ పరిధిలో 27 లక్షల 76 వేల ఇండ్లు, కంటోన్మెంట్‌లో మరో యాబై వేల ఇండ్లలో సర్వే చేయనున్నారని మంత్రి వెల్లడించారు. మొత్తం 28 లక్షల 28 వేల ఇండ్లలో సర్వే చేయనున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 ఇండ్ల కేటాయిస్తున్నారు. ప్రతీ పది మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్ వైజర్ ఉంటారని చెప్పారు. ఏ రోజుకు ఆ రోజు సర్వే వివరాలు ఆన్‌లైన్‌లో ఏంట్రీ చేయనున్నారని పొన్నం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News