Monday, December 23, 2024

బాబా క్షేమమే అంతాబాగే

- Advertisement -
- Advertisement -

అమర్తాసేన్ కూతురు నందనా ప్రకటన
కేంబ్రిడ్జి /న్యూఢిల్లీ : ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్తాసేన్ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. తండ్రి ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంటూ సేన్ కుమార్తె నందనా దేబ్ సేన్ ఓ ప్రకటన వెలువరించారు. ఆయన మరణించారంటూ సామాజిక మాధ్యమాలలో వెలువడ్డ వార్తలను కూతురు, కుటుంబ సభ్యులు మంగళవారం ఖండించారు. ఇవి తప్పుడు వార్తలు, విషయాన్ని నిర్థారించుకోకుండా వెలువరించిన వార్తలని పేర్కొన్నారు.

కేంబ్రిడ్జిలో తామంతా కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపామని , పైగా తండ్రి వారానికోసారి హార్వార్డ్‌లో రెండు కోర్సులు బోధిస్తున్నారని తెలిపారు. ఆయన మునుపటిలాగానే ఆరోగ్యంగా ఉన్నారని కూతురు తెలిపారు. ఓ కొత్త పుస్తకరచనలో కూడా ఉన్నారని , గత రాత్రి కూడా బాబా కుటుంబ సభ్యులతో ముచ్చటించి గుడ్‌బై చెప్పారని తెలిపారు.

మిత్రులు, శ్రేయోభిలాషులు ఇప్పుడు ఆయన గురించి ఆందోళనతో ఫోన్లు చేస్తున్నారని, వారి అభిమానానికి కృతజ్ఞతలు అని తెలిపిన కూతురు తండ్రి బాగున్నారని పేర్కొనడంతో వదంతులకు తెరపడింది. ప్రముఖ ఆర్థికవేత్త అమర్తాసేన్ మరణించారంటూ మంగళవారం పలు వార్తా మాధ్యమాలలో వార్తలు వెలువడటం, సంతాపాలకు కూడా దారితీయడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News