Saturday, December 28, 2024

నోబెల్ శాంతి బహుమతి మానవ హక్కుల న్యాయవాది, మానవ హక్కుల సంస్థలకు

- Advertisement -
- Advertisement -

Nobel Peace Prize

స్టాక్ హోం(స్వీడన్): అక్టోబర్ 7న ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్‌లో అధికారిక ప్రకటన ప్రకారం, మానవ హక్కుల న్యాయవాది అలెస్ బిలియాట్స్కీ,  రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్ మరియు ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ 2022 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నాయి. 1980ల మధ్యలో బెలారస్‌లో ఉద్భవించిన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో అలెస్ బిలియాట్స్కీ ఒకరు. అతను తన స్వదేశంలో ప్రజాస్వామ్యం మరియు శాంతియుత అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశాడు.

నోబెల్ ప్రైజ్ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఇలా ప్రకటించింది: “నార్వేజియన్ నోబెల్ కమిటీ 2022  నోబెల్ బహుమతిని బెలారస్ కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బిలియాట్స్కీ,  రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కి ప్రదానం చేయాలని నిర్ణయించింది.” ఈ ప్రతిష్టాత్మక అవార్డును 1901 నుండి… దాని వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించిన ఐదేళ్ల తర్వాత నుంచి ఇవ్వబడుతోంది. 2021 వరకు 102 శాంతి బహుమతులు అందించబడ్డాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News