Thursday, January 23, 2025

నర్గేస్ కు నోబెల్ శాంతి పురస్కార బహుకరణ

- Advertisement -
- Advertisement -

హెల్సింకి : ఈ ఏటి నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్ హక్కుల ఉద్యమనాయకురాలు నర్గేస్ మెహమ్మది పరోక్షంగా అందుకున్నారు. ఇరాన్‌లో ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తోన్న నర్గేస్ తరఫున ఈ పురస్కారాన్ని ఆదివారం ఆమె పిల్లలు స్వీకరించారు. ఇరాన్‌లో మహిళల హక్కుల, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆమె పాటుపడుతూ వచ్చారు. ఆమెపై మరణశిక్ష తీర్పు కూడా వెలువడింది. 51 సంవత్సరాల నర్గేస్‌ను నోబెల్ శాంతి బహుమతికి నోబెల్ కమిటీ అక్టోబర్‌లో ఎంపిక చేసింది. పేరు ప్రకటించింది. జైలులో ఇరాన్ నిర్బంధంలోని ఆమె రావడానికి కుదరని పరిస్థితిలో ఆమె తరఫున 17 సంవత్సరాల కవలం పిల్లలు దీనిని అందుకున్నారు.

పురస్కారాన్ని తాము ఆమోదిస్తున్నట్లు తెలిపారు. వీరు పారిస్‌లో తమ సమీప బంధువుల వద్ద ప్రవాసంలో ఉంటున్నారు. ఈ నోబెల్ బహుకరణ నేపధ్యంలో జైలులో ఉన్న తల్లి ప్రకటన వెలువరించారు. అంతర్జాతీయ మీడియా సముచిత రీతిలో కీలక పాత్ర పోషించిందని, ఇరాన్ హక్కుల పరిరక్షణోద్యమానికి సరైన రీతిలో ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. తాము తిరిగి తల్లిని కలుస్తామనే నమ్మకం తమకు లేదని పురస్కారం అందుకున్న కవలలు భావోద్వేగానికి లోనయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News