Monday, December 23, 2024

ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్త నర్గ్గీస్ మహమ్మదీని 2023 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి వరించింది. నార్వేకు చెందిన నోబెల్ కమిటీ శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది.

ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాటం సాగిస్తున్న నర్గ్గీస్ మహమ్మదీని నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.

ఇరాన్‌కు చెందిన ప్రముఖ మానవ శక్కుల కార్యకర్త అయిన నర్గ్గీస్ మహమ్మదీ మహిళా హక్కుల కోసం, మరణ శిక్షకు వ్యతిరేకంగా కూడా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె టెహ్రాన్‌లోని ఎవిన్ కారాగారంలో వివిధ కేసులలో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమెకు వివిధ కేసులలో దాదాపు 12 సంవత్సరాల కారాగార శిక్షను న్యాయస్థానాలు విధించాయి.

2003 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని పొందిన షిరిన్ ఫాదీ నాయకత్వంలో పనిచేస్తున్న డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ అనే ఎన్‌జిఓకు ఉపాధ్యక్షురాలిగా నర్గ్గీస్ మహమ్మదీ ప్రస్తుతం ఉన్నారు.
122 సంవత్సరాల క్రితం స్థాపించిన నోబెల్ శాంతి బహుమతిని పొందిన మహిళలలో మహమ్మదీ 19వ వ్యక్తి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News