Friday, November 22, 2024

భౌతికశాస్త్రంలో 2021 నోబెల్ వీరికే…

- Advertisement -
- Advertisement -

 

2021 Nobel in Physics

సుకురో మనాబో, క్లాస్ హాసిల్‌మన్, జార్జియో పారిసీ

స్టాక్‌హోం(స్వీడెన్):  భౌతికశాస్త్రంలో 2021నోబెల్ బహుమతి వాతావరణ ఆవిష్కరణలకుగాను ముగ్గురికి దక్కింది. సుకురో మనాబో, క్లాస్ హాసిల్‌మన్, జార్జియో పారిసీలను ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ మంగళవారం ప్రకటించింది. సంక్లిష్టమైన భౌతిక వవస్థలపై విశ్లేషణలకుగానూ వీరికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఇస్తున్నట్లు తెలిపింది. విశేషమేమిటంటే బహుమతి మొత్తంలో సగం పురస్కారాన్ని జార్జియో పారిసీకి ఇవ్వగా, మిగత సగం సుకురో మనాబో, క్లాస్ హాసిల్‌మన్‌లు పంచుకునేలా నిర్ణయించారు.

పరమాణువుల నుంచి గ్రహాల స్థితిగతులు, వలయాల వరకు భౌతికవ్యవస్థలో హెచ్చుతగ్గులు, వాటి పరస్పర చర్యలను కనుగొన్నందుకుగాను ఇటలీకి చెందిన జార్జియో పారిసీకి ఈ పురస్కారం ఇచ్చారు. కాగా భూ పర్యావరణ భౌతిక నమూనా, వైవిధ్యాలను లెక్కించడం, గ్లోబల్ వార్మింగ్‌ను అంచనా వేయడంలో కృషిచేసినందుకుగాను అమెరికాకు చెందిన సుకురో మనాబో, జర్మనీకి చెందిన హాసిల్‌మన్‌లకు సంయుక్తంగా నోబెల్ బహుమతిని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News