Monday, December 23, 2024

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

- Advertisement -
- Advertisement -

స్టాక్‌హోం: ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటనలో భాగంగా భౌతిక శాస్త్రంలో పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది ఈ పురస్కారం ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెర్రెన్స్‌క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్‌హ్యూలియర్‌కు ఈ ఏడాది నోబెల్‌ను ప్రకటించారు.అణువుల్లో ఎలక్ట్రానిక్ డైనమిక్స్‌ను అధ్యయనం చేసినందుకు, కాంతి తరంగాల లటో సెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకుగాను వీరికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.

వీరి పరిశోధనలతో అణువులు, పరమాణువుల్లో ఎలక్ట్రాన్స్‌ను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు లభించాయని పేర్కొంది.ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటన సోమవారం మొదలైన విషయం తెలిసిందే. తొలుతగా వైద్యశాస్త్రంలో పరిశోధనలకుగాను ఇద్దరికి నోబెల్ ప్రకటించారు. కొవిడ్ మహమ్మారిపై పోరుకుగాను సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్‌ఎ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసినందుకు శాస్త్రవేత్తలు కాటరిన్ కరికో, డ్రూ వెయిన్‌మన్‌లను ఈ పురస్కారం వరించింది. కాగా బుధవారం రసాయన శాస్త్రం,గురువారం సాహిత్య విభాగాల్లో గ్రహీతలను ప్రకటిస్తారు. శుక్రవారం 2023నోబెల్ శాంతిబహుమతిని, 9వ తేదీన అర్థశాస్త్రంలో నోబెల్ పురసార గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు.ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్ 10న గ్రహీతలకు అందజేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News