Thursday, January 23, 2025

నోబెల్ గ్రహీత బిలియాట్స్కికి పదేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

టాలిన్ (ఈస్టోనియా): పురస్కార గ్రహీత, బెలారస్ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది బెలారస్ కోర్టు శుక్రవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. బిలియాట్స్కి తోపాటు మరో ముగ్గురుకు న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలకు ఆర్థికసహాయం చేశారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో వీరు దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది. సహ నిందితులు వాలెంటిన్ స్టెఫానోవిచ్‌కు తొమ్మిదేళ్ల జైలు, వ్లాదిమిర్ ల్యాబ్‌కోవిచ్‌కు ఏడేళ్ల జైలు, డిమిత్రి సోయోవిలోవ్‌కు ఎనిమిదేళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

బిలియాట్సితోపాటు మరో ఇద్దరు ఆయన సహచరులను 2020లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు గ్జాండర్ లుకాషెంకోకు వ్యతిరేకంగా భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో తొలుత అరెస్టు చేశారు. అయితే డిమిత్రి అరెస్టు చేయకముందే దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. నిరసన పాల్గొన్న 35వేల మందిని పోలీసులు అరెస్టు చేయగా వేలాదిమంది పోలీసులు చేతిలో దెబ్బలుతిన్నారు. ఆందోళనకారులకు ఆర్థిక సహాయం, నగదు అక్రమ రవాణా ఆరోపణలపై వీరిని 2021లో అదుపులోకి తీసుకున్నారు.

ఈక్రమంలో సుమారు 21నెలలపాటు జైలులోనే ఉన్నారు. బెలారస్ ప్రభుత్వ ఏజెన్సీబెల్టా న్యాయస్థానం సుదీర్ఘ జైలు శిక్ష విధించడాన్ని ధ్రువీకరించింది. కాగా బిలియాట్సి మానవ హక్కులు, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సాహానికి గుర్తింపుగా నోబెల్ పురస్కారాన్ని పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News