Wednesday, January 22, 2025

హిజాబ్‌ను ఎవరూ ఇష్టపడి ధరించరు : యోగి ఆదిత్యనాధ్

- Advertisement -
- Advertisement -

Nobody likes to wear hijab: Yogi Adityanath

లక్నో : హిజాబ్‌ను ముస్లిం మహిళలపై బలవంతంగా రుద్దుతున్నారని, దానిని ఎవరూ ఇష్టపడి ధరించరని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బీజేపీ నేత యోగి ఆదిత్యనాధ్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్‌ను ఎవరైనా ఇష్టపడి అంగీకరించారా ? అని ప్రశ్నించారు. ఆ ఆడబిడ్డలను, అక్కచెల్లెళ్లను అడగండని చెప్పారు. వారి కన్నీటిని తాను చూశానన్నారు. వారు తమ కష్టాలను చెప్పుకుంటూ ఉంటే వారి బంధువులు కన్నీరు కార్చేవారన్నారు. వ్యక్తిగత వస్త్రధారణ ఆ వ్యక్తి ఇష్టంంపై ఆధారపడుతుందన్నారు. తాను తనకు నచ్చినదానిని ఇతరులపై రుద్దలేదన్నారు. కాషాయం ధరించాలని నా కార్యాలయంలో పని చేసేవారిని నేను కోరగలనా ? నా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విధంగా చెప్పగలనా ? నేను అలా చేయలేను. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి. సంస్థలో అయితే క్రమశిక్షణ ఉండాలని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News