Wednesday, January 22, 2025

నోయిడాలో క్యాబ్ డ్రైవర్ బీభత్సం

- Advertisement -
- Advertisement -

Noida Accident: One Dead Six Injured

వ్యక్తి మృతి..ఆరుగురికి గాయాలు

నోయిడా: నోయిడాలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఒక క్యాబ్ అనేక వాహనాలను ఢీకొంటూ దూసుకెళ్లిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరో ఆరుగురు గాయపడ్డారు. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మద్యం మత్తులో క్యాబ్‌ను నడిపిన డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు నోయిడా అదనపు డిసిపి రణ్‌విజయ్ సింగ్ బుధవారం తెలిపారు. పార్తాలా మార్కెట్ ప్రాంతంలో ముందుగా ఒక కారును ఢీకొన్న క్యాబ్ తర్వాత ఒక టూ వీలర్‌తోపాటు అనేక మందిని ఢీకొంటూ దూసుకెళ్లిందని ఆయన చెప్పారు. ఈ సంఘటనలో మొత్తం ఏడుగురు గాయపడగా ఒక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News