Thursday, January 23, 2025

ఆ పెళ్లి కొడుకు పంట పండింది.. కట్నంగా కార్లూ, కోట్లూ! (వీడియో)

- Advertisement -
- Advertisement -

కలవారి పెళ్లిలో కనిపించేందంతా డాబూ దర్పమే. అలాంటి పెళ్లే ఒకటి ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది. పెళ్లి కూతురు తరఫువారు వరుడికి కట్నంగా చదివించిన బహుమతుల జాబితా చూస్తే కళ్లు తిరిగిపోవాల్సిందే! ధూమ్ ధామ్ గా వందలాది మంది బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లిలో వధువు తరఫు వారు పెళ్లి కొడుక్కి తాము ఇస్తున్న కానుకల జాబితా చదివి వినిపించారు. అందులో ఒక మెర్సిడెస్ ఇక్లాస్ కారు, మరొక ఫార్చ్యూనర్ కారు, 1.25 బంగారం, 7 కేజీల వెండి ఉన్నాయి.

పెళ్లి కొడుకు తరపువారు కూడా తక్కువేం తినలేదు. కన్యాదానం చేసినందుకు వధువు తరపు వారికి కోటి రూపాయల నగదు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ చదివింపుల కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News