Monday, December 23, 2024

కూలీ డబ్బులు ఇవ్వలేదని.. యజమాని కారుపై పెట్రోల్ పోసి…

- Advertisement -
- Advertisement -

Noida labourer sets owner's Mercedes on fire

లక్నో: ఇంటి యజమాని పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడంతో అతడి ఖరీదైన కారును కూలీ తగలబెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడా సెక్టార్ 39లో జరిగింది. నోయిడా ప్రాంతం సదర్‌పూర్ కాలనీలో ఆయుష్ చౌహాన్ అనే వ్యక్తి సొంత ఇల్లును నిర్మించుకుంటున్నాడు. ఇంట్లో టైల్స్ వేసేందుకు జలాల్‌పూర్ గ్రామానికి చెందిన రణ్‌వీర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంట్లో టైల్స్ వేసిన తరువాత 68 వేల రూపాయలు రణ్‌వీర్‌కు రావాల్సి ఉంది. ఎన్ని సార్లు అడిగిన ఆయుష్ డబ్బులు ఇవ్వలేదు. దీంతో ఆయుష్‌పై రణ్‌వీర్ పగ పెంచుకున్నాడు. ఆయుష్ ఇంటి ముందు పార్క్ చేసిన మెర్సిడెజ్ బెంజ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలు సిసి కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News