Sunday, April 6, 2025

నోయిడాలో అనుమానంతో భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో నోయిడాలో నూరుల్లాహ్ హైదర్(55) అనే వ్యక్తి తన భార్య ఆస్మా ఖాన్(42)ను సుత్తితో కొట్టి చంపేశాడని పోలీసు అధికారులు శనివారం తెలిపారు. చంపడానికి ముందు వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని సమాచారం. కాగా ఈ ఘటన శుక్రవారం నోయిడా సెక్టార్ 15 ఏరియాలో చోటుచేసుకుంది. మృతురాలు నోయిడా సెక్టార్ 62లో ఓ ప్రయివేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండేది. ఆమె జామియా మిల్లియా నుంచి గ్రడ్యుయేషన్ పూర్తి చేసింది. నిందితుడు బీహార్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశాడు.

కానీ ప్రస్తుతం పనీపాట లేకుండా ఖాళీగా ఉంటున్నాడు. వారిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. వారికొ ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. వారి కొడుకు ఇంజనీర్ విద్యార్థి కాగా, కూతురు ఎనిమిదో తరగతి చదువుతోంది. వారి కుమారుడు ఎమర్జెన్సీ నంబర్ 112కు ఫోన్‌చేసి విషయంలో పోలీసులకు తెలిపాడు. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నదని డిసిపి రాంబదన్ సింగ్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో హైదర్ తన భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానం పెంచుకున్నాడని వెల్లడయింది. కాగా ‘చాలా రోజులుగా వారిద్దరూ పోట్లాడుకుంటున్నారని వారి కూతురు నాకు తెలిపింది. కానీ ఇంత ఘాతుకానికి అతడు దిగుతాడని ఊహించలేకపోయాను’ అని బాధితురాలి బావ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News