- Advertisement -
నోయిడా : నోయిడా సెక్టార్ 104లో ఒక వ్యక్తిని అతని కారులోనే బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు శుక్రవారం కాల్చి చంపారు. సూరజ్ భాన్ జిమ్ నుంచి కారులో తిరిగి వస్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అతనిపై పట్టపగలు కాల్పులు జరిపారు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యే లోపు ఔదు రౌండ్లు తూటాలు కాల్చారు. పోలీసుల కథనం ప్రకారం, సూరజ్ భాన్ తన కారు లోపల కూర్చోగానే అతనిపై కాల్పులు జరిగాయి.
పోలీసులు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని అతనిని ఆసుపత్రికి హుటాహుటిని తరలించారు. కానీ అతను గాయాలతో మరణించాడు. సూరజ్ భాన్ శవాన్ని ఆటాప్సీ కోసం పంపినట్లు, ఈ కాల్పుల సంఘటన సందర్భంగా ఒక హత్య కేసును నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, నాలుగు వేర్వేరు పోలీస్ బృందాలు దర్యాప్తు నిర్వహిస్తున్నార. నేర పరిశోధనలో భాగంగా సిసిటివి ఫుటేజ్‌ను స్కాన్ కూడా చేస్తున్నారు.
- Advertisement -