- Advertisement -
నోయిడా , ఘాజియాబాద్: గౌతమ్‌బుద్ధ నగర్‌లో 154 కొత్త కొవిడ్ కేసులు వెలుగుచూడ్డంతో ఆదివారం యాక్టివ్ కేసుల సంఖ్య 1005కు చేరుకుంది. రోజువారిగా 2500 శాంపిల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఆదివారం 6.16 శాతం పాజివ్ రేటు నమోదయింది. పొరుగున ఉన్న ఘాజియాబాద్‌లో రోజువారీ కొవిడ్ కేసులు ఆదివారం 99కి చేరుకున్నాయి. జిల్లాలో పాజిటివ్ రేటు ఆదివారం 2.93 శాతంగా ఉంది. గౌతమ్‌బుద్ధనగర్, ఘాజియాబాద్‌లోనేకాక లక్నో, వారణాసి, మీరట్‌లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు యూపి రాష్ట్రంలో 5000కు పైగా కేసులు నమోదయ్యాయి. వాతావరణం మార్పు కారణంగా కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోందని నోయిడా హాస్పిటల్‌కు చెందిన డాక్టర్లు చెబుతున్నారు. శరీరంలో జ్వరం వంటి మార్పులను వెంటనే పసిగట్టి జాగ్రత్త పడాలని అక్కడి డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
- Advertisement -