Thursday, January 23, 2025

నోయిడాలో ట్విన్ టవర్స్ నేలమట్టం (వీడియో)

- Advertisement -
- Advertisement -

Noida Supertech Twin Towers Demolition

నోయిడా: నోయిడాలో అక్రమంగా నిర్మించిన ట్విన్ టవర్స్ ఆదివారం నేలమట్టమయ్యాయి. 40 అంతస్తుల ఎత్తైన జంట భవనాలను నేలమట్టం చేశారు. శిథిలాల తొలగింపునకు 3 నెలల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. 3,700 కిలోల పేలుడు పదార్థాలు వినియోగించి 100 మీటర్లు దూరం నుంచి బటన్ నొక్కగానే పిల్లర్లు పేలిపోయి, జంట భవనాలు నిట్టనిలువుగా కుప్పకూలిపోయాయి. పేలుడుకు 10 సెకండ్ల సమయం పట్టగా, తర్వాత 5 సెకండ్లలోనే టవర్లు పూర్తిగా కిందకు పడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీ దుమ్మురేగింది. జంట టవర్ల నిర్మాణాలను ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ నేలమట్టం చేసింది. ఈ భవనాలను సూపర్ టెక్ సంస్థ నిర్మించింది. పరిసర ప్రాంతాల ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News