Sunday, January 19, 2025

మహిళను చంపి… ఆత్మహత్యగా తానే సూసైడ్ నోట్ రాసి… ప్రియుడితో జంప్

- Advertisement -
- Advertisement -

లక్నో: తన స్థానంలో మరో మహిళను హత్య చేసి తానే ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్ రాసి తన ప్రియుడితో కలిసి ప్రియురాలు పారిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాయల్ భాటి అనే మహిళ అజయ్ టాకూర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పాయల్ అతడితో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుంది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. హేమ చౌదరీ, పాయల్ భాటి, అజయ్ టకూర్ ఒకే షాపింగ్ మాల్ లో పని చేసేవారు. ఇద్దరు కలిసి హేమ చౌదరీని హత్య చేశారు. అనంతరం ముఖాన్ని చింద్రం చేసి తన దుస్తులును ఆమెకు తొడిగారు. అనంతరం తానే అత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాసింది. తన ప్రియుడితో కలిసి పాయల్ పారిపోయింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని సూసైట్ నోట్ పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పాయల్ బాటి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

నవంబర్ 12న తన కూతురు కనిపించడంలేదని హేమ చౌదరీ కుటుంబ సభ్యులు బిస్రాఖ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఆరు నెలల క్రితం పాయల్ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. పాయల్ తండ్రి సోదరుడి అత్తమామల దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు. అప్పు కోసం పాయల్ తండ్రితో బంధువులు గొడవకు దిగారు. అప్పు తిరిగి చెల్లించాలని పాయల్ తండ్రిని వేధించిడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పాయల్ కూడా ఆత్మహత్య చేసుకొని బంధువులపై నేర మోపాలని ఫేక్ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఆమె అజయ్‌తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఇంట్లో వాళ్లు వ్యతిరేకించారని పాయల్ తాత తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News