Monday, November 25, 2024

రూ.7వేల ధరలో నోకియా ఫ్లిప్ ఫోన్..

- Advertisement -
- Advertisement -

ఒకవైపు స్మార్ట్‌ఫోన్‌ల ట్రెండ్ పెరుగుతుండగా, మరోవైపు ఫీచర్ ఫోన్‌లను వాడేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. నేడు ఫీచర్ ఫోన్‌లు మన్నిక, కార్యాచరణ పరంగా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇక కీప్యాడ్ ఫోన్ల విషయానికి వస్తే.. నోకియా పేరు మొదట వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నోకియా ఇటీవల నోకియా 2780 ఫ్లిప్ ఫీచర్ ఫోన్‌ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ గురుంచి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ ఫీచర్ ఫోన్ స్టైలిష్, ఫంక్షనల్ డిజైన్‌తో వస్తుంది. ఫోన్ 2.7 అంగుళాల QVGA డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే బాహ్య డిస్‌ప్లే పరిమాణం 1.77 అంగుళాలు. ఈ ఫోన్ రెడ్, బ్లూ, బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే .. $89.99 ధరతో అంటే రూ.7490 గా ఉంది. నోకియా 2780 ఫ్లిప్ చాలా మంది వినియోగదారులకు చాలా సరసమైనది. రోజువారీ ఉపయోగం కోసం ఇది చాలా మంచి ఫోన్. ప్రతి వర్గం వినియోగదారులు దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు.

ఈ ఫోన్ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఈ ఫోన్ కనెక్టివిటీ కోసం అమెరికాలో 4జి వోల్టి సపోర్ట్, HD హెచ్ డి వాయిస్ కాల్స్, AT&T, వెరిజోన్, T-Mobile సౌకర్యాలను కలిగి ఉంది. ఇది కాకుండా.. Wi-Fi, బ్లూటూత్ 4.2, USB టైప్ C పోర్ట్ కూడా ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ఫోన్‌లో యూట్యూబ్, గూగుల్ మ్యాప్ వంటి యాప్‌లను సులభంగా ఉపయోగించవచ్చు. నోకియా 2780 ఫ్లిప్ 4 జిబి రామ్, 512 MB అంతర్గత నిల్వతో వస్తుంది. దీనిలో వినియోగదారులు మైక్రో SD కార్డ్ సహాయంతో 32 GB వరకు నిల్వను పెంచుకోవచ్చు.

అలాగే ఇక కెమెరా విషయానికి వస్తే.. ఫోన్‌లో ఫ్లాష్‌తో కూడిన 5MP వెనుక కెమెరా ఉంది. ఇది ప్రాథమిక ఫోటోగ్రఫీ, వీడియోను రికార్డ్ చేయగలదు. ఇక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే.. ఈ ఫోన్ 1450mAh రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18 రోజుల వరకు స్టాండ్‌బై సమయం, దాదాపు 7 గంటల టాక్ టైమ్‌ని అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News