Friday, December 27, 2024

నోకియాలో 14,000 మంది ఉద్యోగులపై వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఖర్చులను తగ్గించుకునేందుకు గాను టెలికాం కంపెనీ నోకియా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది. 2026 సంవత్సరం ముగింపు నాటికి 9,000 నుంచి 14,000 మధ్య ఉద్యోగులను తొలగించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. 5జి పరికరాల సేల్స్ తగ్గడం వల్ల మూడో త్రైమాసికంలో మొత్తం అమ్మకాలు 20 శాతం క్షీణించగా, దీని కారణంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. నోకియా ఈ నిర్ణయం తర్వాత కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 86,000 నుంచి 72,000కి తగ్గనుంది. కంపెనీ మొత్తం శ్రామిక శక్తిలో ఈ సంఖ్య దాదాపు 16 శాతం ఉంటుంది. నోకియా నికర అమ్మకాలు రూ. 11,052 కోట్లు క్షీణించాయి. గత ఏడాది రూ.54,747 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కంపెనీ నికర విక్రయాలు రూ.43,695 కోట్లకు తగ్గాయి.

కంపెనీ సిఇఒ పెక్కా లండ్‌మార్క్ మాట్లాడుతూ, నోకియా తన కార్పొరేట్ కేంద్రాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించింది. మార్కెట్ అనిశ్చితి నేపథ్యంలో ఖర్చులను రీసెట్ చేయడం ద్వారా వ్యాపారాన్ని లాభసాటిగా మార్చాల్సి ఉందని అన్నారు. దీనికోసం 2026 నాటికి ఖర్చుతో పోలిస్తే ఆదాయాన్ని పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. తద్వారా వచ్చే మూడేళ్లలో రూ.10,529 కోట్ల వరకు ఆదా చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో వచ్చే ఏడాది అంటే 2024లో రూ.3,511 కోట్లు, 2025లో రూ.2633 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News