Monday, December 23, 2024

మమ్మల్ని నామినేట్ చేయండి

- Advertisement -
- Advertisement -

గవర్నర్‌కు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వినతి
మన తెలంగాణ/హైదరాబాద్ : హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాజ్యాంగ బద్దంగా గత మంత్రివర్గం చేసిన సిఫార్సు ప్రకారం తమను శాసనమండలికి నామినేట్ చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బిఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ , కుర్రా సత్యనారాయణ కోరారు. గవర్నర్ కోటా ఎంఎల్‌సిల విషయంలో హైకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నట్లు వారు తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో చిత్తశుద్ధితో కూడిన తమ పోరాటం, త్యాగం, సేవలను గుర్తించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

రాజ్యాంగంలోని 171(5) ఆర్టికల్ ప్రకారం తమకు సరిపడా అర్హతలు ఉన్నాయన్న ఇరువురు నేతలు సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన తమ లాంటి వారికి శాసన వ్యవస్థలో ప్రాతినిథ్యం వహించే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయన్నారు. ప్రస్తుత సందర్భం మరింత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు, తమ అర్హతలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగ బద్ధంగా 2023 జులైలో మంత్రివర్గం సిఫార్సును అమలు చేయాలని శ్రవణ్, సత్యనారాయణ కోరారు. రాజ్యాంగ స్ఫూర్తి, మానవతా న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. చట్టసభల్లో తమ వంతు పాత్ర పోషించి, తమ సామాజిక వర్గాలు, దేశానికి సేవ చేయాలన్న గొప్ప ఉత్సాహంతో ఉన్నామన్న దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News