Sunday, January 19, 2025

సిఎం కెసిఆర్‌ను కలిసిన నామినేటెడ్ చైర్మన్లు

- Advertisement -
- Advertisement -
అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన భూపాల్‌రెడ్డి, భిక్షపతి

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా తనకు అవకాశమిచ్చినందుకు మాజీ ఎమ్మెల్సీ వి. భూపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్జతలు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని పేర్కొన్నారు.
అదే విధంగా తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించినందుకు మఠం భిక్షపతి సిఎం కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించి ప్రజలకు సేవలందిస్తానన్నారు.

KCR4

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News