Wednesday, January 22, 2025

20 మందికి నామినేటెడ్ పోస్టులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషిచేసిన నేతలకు, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రక్రియను సిఎం రేవంత్ మొదలు పెట్టా రు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారుగా నా లుగు నుంచి ఐదు పేర్లను తెప్పించుకున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా ముందస్తుగా 18 నుంచి 20 మందికి నామినేటెడ్ పోస్టులను కేటాయించాలని సిఎం నిర్ణయించినట్టుగా సమాచారం. త్వరలోనే వీటికి సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సిఎం కూడా వారి పేర్లకు ఆమోదముద్ర వేయడంతో పాటు ఆ జాబితాను ఢిల్లీ అధిష్టానానికి పంపించినట్టుగా సమాచారం. ఇప్పటికే ముఖ్య నేతలు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, హర్కర వేణుగోపాల్ రెడ్డిలకు క్యాబినెట్ ర్యాంక్‌ను కల్పి స్తూ అడ్వైయిజర్ పోస్టులు ఇవ్వగా, త్వరలో మరో 18 నుంచి 20 మంది కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సిఎం భావిస్తున్నట్టుగా తెలిసింది.
టిపిసిసి, ఏఐసిసిల సమన్వయంతో పోస్టుల భర్తీ
మిగిలిన 30 నుంచి 40 పోస్టులను ఈనెలాఖరులోగా మిగతా వారికి కేటాయించాలని సిఎం రేవంత్‌కు భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే సిఎం రేవంత్ పంపించిన జాబితాకు ఢిల్లీ నుంచి ఆమోదం ముద్రపడగానే ఆ జాబితాలోని పేర్లను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పదవులతో పాటు కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని సిఎం రేవంత్ భావిస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో పేర్లను వెల్లడించాలని ఆయన నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇదే విషయాన్ని సిఎం రేవంత్ అధిష్టానం వద్ద కూడా పేర్కొన్నట్టుగా సమాచారం. దీంతోపాటు త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఎంపి స్థానాలను గెలిపించే వారికి కూడా ఈ నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టుగా తెలిసింది. దీంతోపాటు రానున్న రోజుల్లో ఎన్నికల సీజన్ కావడంతో పార్టీలో అసంతృప్తి రాగం వినిపించ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం నిర్ణయించినట్టుగా సమాచారం. అందులో భాగంగానే టిపిసిసి, ఏఐసిసిల సమన్వయంతో ఈ పోస్టులు కేటాయించనున్నట్టుగా తెలిసింది.
మొదటి జాబితాలో ఆశావహులు భారీగా..
కష్టపడి పనిచేసిన వారికి, మొదటి నుంచి పార్టీ కోసం కృషి చేసిన వారికి మొదటి జాబితాలో అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. అందులో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనరెడ్డి, డిసిసి మాజీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, పిసిసి అధికార ప్రతినిధుల్లో అద్దంకి దయాకర్, చరణ్ కౌశిక్ యాదవ్, భవానీరెడ్డి, విజయశాంతి, చిన్నారెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, వి.హనుమంతరావు, సామ రామ్మోహన్ రెడ్డి, రాములు నాయక్, మల్లాది పవన్, చిన్నారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, పున్నా కైలాస్ నేత, బైకాని లింగం యాదవ్, కాల్వ సుజాత, రియాజ్, శివసేనారెడ్డి, అన్వేష్ రెడ్డి, ప్రీతమ్, బెల్లయ్య నాయక్, మెట్టు సాయి కుమార్, నూతి శ్రీకాంత్ గౌడ్, ముత్తినేని వీరయ్య, రాచమల్ల సిద్దేశ్వర్, చరణ్ కౌశిక్, బాలలక్ష్మీ, తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి పుష్పలీల, పటేల్ రమేష్‌రెడ్డిల పేర్లను పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరిలో కొందరికి కార్పొరేషన్ చైర్మన్లు, మరి కొందరికి ఇతర పదవులు ఇవ్వాలని పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు పొంది ఓడిపోయిన మధుయాష్కీ గౌడ్, ఫిరోజ్ ఖాన్, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పోదెం వీరయ్య, సునీతరావ్, సంపత్ కుమార్ లకు కూడా ప్రాధాన్యత కల్పించాలని భావనలో పార్టీ ఉన్నట్టు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News