Wednesday, January 22, 2025

తొలి విడతలో 10 మందికి నామినేటెడ్ పోస్టులు!

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రానున్న లోక్ సభ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడుతలో 10 మందికి పదవులు కట్టబెట్టనుంది. అధిష్టానంతో చర్చించి సంక్రాంతి పండగ తర్వాత పదవులు దక్కిన నేతల పేర్లు వెల్లడించనున్నట్లు నేతలు  చెబుతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలోపు 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన నేతలకే అవకాశం ఇవ్వాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు బడా నేతల టాక్ వినిపిస్తోంది.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షి పలువురు కీలక నేతలు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులపై సమీక్షించి నామినేటెడ్ పోస్టుల కోసం 10 నుంచి 15 మందితో ఓ జాబితాను సిద్ధం చేసి నామినేటెడ్ పదవుల లిస్ట్ ను హైకమాండ్ కు పంపినట్లు తెలుస్తోంది. దీంతో లిస్టులో తమ పేరు ఉందో లేదో అని తెలుసుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. అటు ఎంఎల్ఏ టికెట్లు వదులుకున్న నేతలు కచ్చితంగా తొలి విడుతలో తమకు అవకాశం దక్కుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ పదవులు ఎవరిని వరించనున్నాయో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News