Sunday, April 6, 2025

ఇక పదవుల పందేరం

- Advertisement -
- Advertisement -

20లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ?
పిసిసిని ఆదేశించిన ఎఐసిసి
అసంతృప్తులను బుజ్జగించే యత్నం

మన తెలంగాణ/హైదరాబాద్ : అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం పి సిసిని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న కేడర్‌ను సంతృప్తి పరిచేలా చర్యలు చేపట్టాల ని పిసిసికి సూచించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 20వ తేదీలోపు అన్ని నామినేటెడ్ పదవుల భర్తీని
చేపట్టాలని పిసిసి నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పేర్లను కూడా ఏఐసిసికి పిసిసి పంపించినట్టుగా తెలిసింది.

ఢిల్లీ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఈ పదవులను పిసిసి భర్తీ చేయనున్నట్టుగా సమాచారం. దీంతోపాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యే బలంతో నాలుగు ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో అందులో నుంచి ఒక సీటును సిపిఐకి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మిగిలిన మూడు సీట్ల అభ్యర్థుల పేర్లను ఏఐసిసి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఈనెల 08వ తేదీ లోగా పిసిసి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ముగ్గురు అభ్యర్థులను కూడా ఆయా సామాజిక వర్గాల ప్రాతిపదికన పేర్లను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News