Monday, December 23, 2024

పాటియాలా నుంచి కెప్టెన్ అమరీందర్ నామినేషన్

- Advertisement -
- Advertisement -
Nomination of Captain Amarinder from Patiala
మాదే ప్రభుత్వమన్న కేంద్ర మంత్రి

పాటియాలా : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి , పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) వ్యవస్థాపకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం నాడు నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ఎస్. షెకావత్ పలువురు నేతలు హాజరయ్యారు. నామినేషన్‌కు ముందు ఆయన గురుగోవింద్ సాహిబ్ ఖడ్గం నుంచి ఆశీర్వాదం పొందారు. గురుగోవింద్ సింగ్ సాహిబ్ లోని మత పెద్దలు ఆయనకు ఖడ్గం ఆశీర్వాదాలు అందించారు. పాటియాలా నియోజక వర్గం నుంచి కెప్టెన్ అమరీందర్ పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లోబీజేపీపంజాబ్ లోక్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. అమరీందర్ సింగ్ నామినేషన్ తరువాత మీడియాతో గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ బీజేపీపీఎల్‌సీ కూటమి పాటియాలాతో సమా117 సీట్ల లోనూ చరిత్ర సృష్టిస్తుందన్నారు. పంజాబ్ ప్రజలకు రాష్ట్ర భద్రత, దేశ భద్రత చాలా ముఖ్యమని, అదే లక్షంతో తమ కూటమి పోటీ చేస్తోందని చెప్పారు. తప్పనిసరిగా తమ కూటమి పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News