Friday, April 4, 2025

మునుగోడులో ముగిసిన నామినేషన్ల పర్వం

- Advertisement -
- Advertisement -

Munugodu nominations

నల్గొండ: మునుగోడు  ఉపఎన్నికలో  నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఈరోజు 25 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తంగా చూస్తే వంద మంది నామినేషన్లు వేసినట్లు సమాచారం. రేపు (శనివారం) నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 17వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 6న కౌంటింగ్, ఫలితాలు వెలువడుతాయి.ఈ ఎన్నికలో పోటీ తీవ్రంగా ఉంది. కానీ జనం నాడి ఎవరికీ అందడం లేదు. ఉపఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో.. ఈ ప్రభావం ఏ అభ్యర్థిపై ఉంటుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఈ ఉపఎన్నిక బరిలో టిఆర్ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బిజెపి అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి, ప్రజాశాంతి పార్టీ నుంచి కెఏ పాల్, టిజెఎస్ నుంచి పల్లె వినయ్‌కుమార్‌ బరిలో ఉన్నారు. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార టిఆర్ఎస్ పార్టీ, బిజెపి, కాంగ్రెస్‌లు తమ అభ్యర్ధులతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News