Saturday, January 11, 2025

ఏప్రిల్ 26న 88 లోక్‌సభ స్థానాలలో పోలింగ్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన రెండవ దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనున్న రెండవ దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 88 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. కర్నాటకలోని 28 స్థానాలలో 14 సీట్లకు రెండవ దశలో పోలింగ్ జరగనున్నది. ఇవి కాక అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీరులోని 74 నియోజవకర్గాలకు రెండవ దశలో పోలింగ్ జరగనున్నది. లోక్‌సభ ఎన్నికలతోపాటు ఔటర్ మణిపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఏప్రిల్ 26న పోలింగ్ జరగనున్నది. మణిపూర్‌లో అశాంతి నెలకొన్న దృష్టా ఔటర్ మణిపూర్ నియోజవకర్గాలలో రెండు దశలలో పోలింగ్ నిర్వహించాలని ఇసి నిర్ణయించిది.

నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 12 రాష్ట్రాలు, యుటిలలోని 88 నియోజవకర్గాలలో అమలులోకి వస్తుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఏప్రిల్ 5న 11 రాష్ట్రాలు, యుటిలలో నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. జమ్మూ కశ్మీరులో ఏప్రిల్ 6న జరుగుతుంది. రెండవ దశలో పోలింగ్ జరగనున్న అన్ని నియోజకవర్గాలలో ఏప్రిల్ 8న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. జూన్ 4న దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పోలైన ఓట్లకు కౌంటింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. కాగా..ఏడు దశల లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 16న ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశలలో 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News