- Advertisement -
న్యూఢిల్లీ: పద్మ పురస్కారాలు 2023కు సంబంధించి సెప్టెంబర్ 15వరకు ఆన్‌లైన్‌లో నామినేషన్లు, సిఫార్సులు స్వీకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రజలనుంచి నామినేషన్లు, సిఫార్సులు కోరుతున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో మాత్రమే రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌లో తమ నామినేషన్లు దాఖలు చేయవచ్చని కేంద్రం మంత్రిత్వశాఖతెలిపింది. కాగా 1954 నుంచి పద్మపురస్కారాలను అందజేస్తున్నారు. పద్మవిభూషణ్, పద్మశ్రీలను దేశ అత్యున్నత పౌర పురస్కారాలుగా పరిగణిస్తారు.ప్రతి ఏడాది రిపబ్లిక్ డే పద్మపురస్కారాల విజేతలను ప్రకటిస్తారు. కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్య, సామాజిక సేవ, పబ్లిక్ సర్వీస్ తదితర రంగాల్లో విశిష్ట పద్మ పురస్కారాలు అందజేస్తారు.
- Advertisement -