Wednesday, January 1, 2025

మునుగోడు.. హోరు

- Advertisement -
- Advertisement -

199 నామినేషన్లు దాఖలు

చివరిరోజు 50కి పైగా నామినేషన్లు రేపు, ఎల్లుండి నామినేషన్ల పరిశీలన
ఉపసంహరణ గడువు అక్టోబర్ 17 ఇక హోరెత్తనున్న ప్రచారం

మన తెలంగాణ/హైదరాబాద్: నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక రాజకీయ రణరంగమే మిగిలింది. ఎన్నికల బరిలో పలువురు అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య పోరు రసవత్తరంగా నెలకొంది. మూడు పార్టీలకు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మంగా మారడంతో మునుగోడులో రాజకీయ పరిస్థితులు క్షణక్షణం అనేక మలుపు తిరుగుతున్నాయి. దీంతో మూడు పార్టీల అగ్రనేతలంతా మునుగోడులోనే మెహరించారు. ఉప ఎన్నికను అధికార టిఆర్‌ఎస్ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా టిఆర్‌ఎస్‌ను జాతీయపార్టీగా మారి న తర్వాత జరుగుతున్న తొలి ఉపఎన్నిక ఇది. దీంతో మునుగోడులో గెలుపు కోసం సిఎం కెసిఆర్ సూపర్ ప్లా న్ వేశారని తెలుస్తోంది. ప్రభుత్వపథకాలు, అభివృద్ధిపై విమర్శలు చేస్తోన్న ప్రతిపక్షాలకు సమాధానం చెప్పేలా మునుగోడు నియోజకవర్గంలో లబ్ధి పొందుతున్న దాదా పు 4లక్షల మందికి కెసిఆర్ స్వయంగా లేఖలు రాయనున్నారని టిఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది.

అలాగే ఈనెల 30న చండూరులో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ఈ సభ జరగనుంది. ఈ సభ ద్వారా ప్రతిపక్షా ల విమర్శలకు కెసిఆర్ దీటైన సమాధానం ఇవ్వనున్నారని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి గత ఆగస్ట్ నెల మొదటి వారంలోనే ప్రజాదీవెన ద్వారా తొలిబహిరంగ సభను ఆయన మునుగోడులో నిర్వహించారు. ఇక ప్రతి ఎంపిటిసి పరిధిలో ఒక శాసనసభ్యుడిని పార్టీ ఇన్‌ఛార్జీలుగా రంగంలోకి దింపింది. వారు క్ష్రేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక మంత్రులు కెటిఆర్, హ రీశ్ రావు కూడా ఈ నెల 17 నుంచి పూర్తిస్థాయిలో ప్రచార పర్వంలోకి పూర్తిస్థాయిలో దిగనున్నారు. అయి తే కెటిఆర్ ఇప్పటికే పార్టీ అభ్యర్ధి కూసుకుంట ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా పాల్గొని విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బిజెపిలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కెటిఆర్ చేసిన విమర్శలపై ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది.

ఇది పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపింది. ఇక మునుగోడులో జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమిస్తూనే ఉన్నారు. పార్టీ అభ్యర్ధి పక్షాన ఆయన ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు. అలాగే మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్ త దితరులు ఇప్పటికే పలుమార్లు మునుగోడులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సమయంలో బిజె పి కూడా తన ప్రచార పర్వాన్ని మరింత ముమ్మరం చే సింది. రాష్ట్ర అగ్రనేతలందరినీ కూడా నియోజకవర్గంలోనే మొహరింప చేసింది. పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే వచ్చి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశా రు. ఇక ఒకటి, రెండు రోజుల తరువాత కేంద్ర మంత్రుల తాకిడి మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని తె లుస్తోంది. కాగా ఈ నియోజకవర్గం ఉపఎన్నికలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాలు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా మునుగోడు నియోజకవర్గాన్ని తిరిగి దక్కించుకునేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను శరవేగంగా అమలు చేస్తోంది. పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్న పల్వాయ్ శ్రవంతికి మద్దతుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే సుమారు 35మందికి పైగా స్టార్ క్యాంపైన్లను ప్రచార రంగంలోకి దింపింది. బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలకు దీటుగా రెండు, మూడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని తలపెట్టింది. అలాగే రాహుల్ గాంధీ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించనున్న సందర్భంగా ఆయనను కూడా మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేలా చేయాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. .

ఇదిలా ఉండగా మునుగోడును ప్రధాన పార్టీలన్నీ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమిఫైనల్ గా భావిస్తున్నాయి. దీంతోమునుగోడు ఉపఎన్నికల పోరు ఇప్పటికే తారస్థాయికి చేరింది. మూడు ప్రధాన పార్టీల నేతలంతా గ్రామాల్లోనే మకాం వేశారు. గడప గడపకూ తిరుగుతున్నారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలను పేల్చుకుంటున్నారు. మొత్తం మీద మునుగోడు ఉపఎన్నిక ప్రధాన పార్టీల్లో కాక పుట్టిస్తోంది.

భారీగా నామినేషన్లు

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. 129 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం ఒక్కరోజే 50కి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. రేపు, ఎల్లుండి నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 17. ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నారు. 6న ఓట్ల లెక్కించి, ఫలితాలను విడుదల చేయనున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతిరెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ ఉంది. 2018 ఎన్నికల సమయంలో మునుగోడులో మొత్తం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. చివరగా 15 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే ఇది ఉప ఎన్నిక కావడంతో నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. 129 మంది అభ్యర్థులు…187 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ జన సమితి అభ్యర్థిగా పల్లె వినయ్, బీఎస్పీ అభ్యర్థిగా ఆందోజు శంకరాచారి, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కెఎ పాల్ నామినేషన్లు దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News