Monday, January 20, 2025

రేపటి నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు

- Advertisement -
- Advertisement -

Nominations for Vice President Election 2022 from Tomorrow

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. ఆగస్టు 6న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మంగళవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనున్నది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీన ముగియనున్నది. నామినేషన్ పత్రాల పరిశీలన జులై 20న, నామినేషన్ల ఉపసంహరణకు గడువు జులై 22వ తేదీ. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో నామినేషన్ పత్రాల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతోపాటు నామినేటెడ్ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకునే ఉప రాష్ట్రపతి ఎన్నికలో విజయావకాశాలు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అభ్యర్థికే అధికంగా ఉన్నాయి. కాగా, తమ అభ్యర్థుల పేర్లను రాజకీయ పార్టీలు ఇంకా ప్రకటించవలసి ఉంది.

Nominations for Vice President Election 2022 from Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News