Monday, December 23, 2024

8 మంది బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. 119 నియోజకవర్గాలకు 4,798 నామినేషన్లు రాగా వాటిలో అన్నింటిని రిటర్నింగ్ అధికారులు పరిశీలన చేయగా అందులో 8 మంది బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ప్రస్తుతం బీఎస్పీ 111 స్థానాల్లో తలపడనుంది.

నామినేషన్లకు తిరస్కరణకు గురైన అభ్యర్థులు: 

1. స్టేషన్ ఘన్ పూర్ (ఎస్సీ): తాళ్ళపల్లి వెంకటస్వామి
2. పాలకుర్తి :సింగారం రవీంద్రగుప్త
3. భువనగిరి: ఉప్పల జహంగీర్
4. మిర్యాలగూడ: జాడి రాజు
5. ఆలేరు:  గందమల్ల లింగస్వామి
6. మధిర (ఎస్సీ: చెరుకుపల్లి శారద
7. బహదూర్ పుర: కె. ప్రసన్న కుమారి యాదవ్
8. గోషామహల్: మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News