Saturday, April 26, 2025

ఆర్. కృష్ణయ్యపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Non-Bailable Case registered against R. Krishnaiah

హైదరాబాద్: బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్ నగరానికి చెందిన రవీందర్ రెడ్డి తన భూమిని ఆర్.కృష్ణయ్య కబ్జా చేశారని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. తన భూమిని కబ్జా చేయడంతో పాటుగా తనను చంపేందుకు కూడా కృష్ణయ్య యత్నించారని రవీందర్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఆర్.కృష్ణయ్యపై కేసు నమోదు చేయాలని రాయదుర్గం పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆర్.కృష్ణయ్యతో పాటు మరికొందరిపై రాయదుర్గం పోలీసులు ఐపిసి సెక్షన్లు 447, 427, 506, 384, రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News