Thursday, January 23, 2025

విజయ్ మాల్యాపై నాన్‌బెయిలబుల్ వారెంట్

- Advertisement -
- Advertisement -

ముంబై: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్‌మాల్యాపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు చెందిన రూ.180 కోట్ల రుణం ఎగవేసిన కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. జూన్ 29న ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి నాయక్ నింబాల్కర్ ఈ వారెంట్‌ను జారీ చేశారు. పూర్తి ఉత్తర్వులు జులై 1న వెలుగులోకి వచ్చాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ప్రమోటర్ అయిన మాల్యాపై 2007 నుంచి 2012 మధ్య కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం ఐఓబీ బ్యాంక్ నుంచి పొందిన రుణాలను మాల్యా ఎగవేతకు పాల్పడ్డారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఉద్దేశ పూర్వకంగా చెల్లింపుల ఎగవేతకు పాల్పడ్డారని పేర్కొంది. దీంతో ప్రభుత్వ బ్యాంకుకు రూ. 180 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపింది. ఛార్జ్‌షీట్ లోని వివరాలను పరిగణన లోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు… విజయ్‌మాల్యాను రప్పించేందుకు ఓపెన్ ఎండెండ్ నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడానికి ఇదే సరైన కేసుగా కోర్టు అభిప్రాయపడింది. భారత్ లోని చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకొనేందుకు మాల్యా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారంటూ నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. 2016 లోనే భారత్ నుంచి విదేశాలకు పారిపోయిన మాల్యా, ప్రస్తుతం లండన్‌లో నివాసం ఉంటున్నారు. పరారీలో ఉన్న ఆయనను తమకు అప్పగించాలని భారత్ చాలా కాలంగా కోరుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News