Monday, July 8, 2024

ఎడియూరప్పపై ఎన్‌బిడబ్లు జారీ

- Advertisement -
- Advertisement -

ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై నమోదైన పోక్సో కేసులో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు బిఎస్ ఎడియూరప్పకు స్థానిక కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. ఎడియూరప్ప నమోదైన పోక్సో కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి ప్రశ్నించేందుకు ఆయనకు సమన్లు జారీచేసింది. అయితే తనకు సమయం కావాలని ఆయన సిఐడికి తెలిపారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన ఎడియూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన సిఐడి ఎదుట హాజరవుతారని పార్టీ వర్గాలు ఇదివరకు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని ఎడియూరప్ప నివాసానికి తాను, తన 17 ఏళ్ల కుమార్తె వెళ్లగా తన కుమార్తెపై

ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారని ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై సదాశివనగర్ పోలీసులు మార్చి 14న కేసు నమోదు చేశారు. కాగా..వెంటనే ఈ కేసును సిఐడికి బదిలీ చేస్తూ కర్నాటక డిజిపి అలోక్ మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. ఎడియూరప్పపై ఫిర్యాదు చేసిన గత నెలలో ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు. తనపై వచ్చిన ఆరోపణలను 81 ఏళ్ల ఎడియూరప్ప ఖండించారు. ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎడియూరప్పను తమ కార్యాలయానికి పిలిపించిన సిఐడి ఆయనను నుంచి స్వర నమూనాను సేకరించింది. ఈ కేసులో సిఐడి తరఫున వాదించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాగా..తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ని కొట్టివేయాలని కోరుతూ ఎడియూరప్ప కోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News