హైదరాబాద్: నటి జీవితా రాజశేఖర్‌కు ఎపిలోని నగరి కోర్టు శుక్రవారం నాడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జీవితారాజశేఖర్ ఇచ్చిన చెక్కులు సైతం బౌన్స్ అయ్యాయని జోష్టర్ ఎండి హేమ వివరించారు. గరుడ వేగ సినిమా నిర్మాణం కోసం జీవితారాజశేఖర్ దంపతులకు రూ.26 కోట్లు అప్పు ఇచ్చామని, అప్పుకోసం ఆస్తి డాక్యుమెంట్లు తనఖా పెట్టారని, అయితే తమకు తెలియకుండా ఆ ప్రాపర్టీని మరొకరికి అమ్మారని తెలిపారు. జీవితా రాజశేఖర్ రూ.26 కోట్లు ఎగ్గొట్టారని చెప్పారు. ఈ వ్యవహారంపై తిరువాళ్లూరులో కేసు పెట్టామని ఆమె పేర్కొన్నారు. జీవితా రాజశేఖర్‌పై చెక్‌బౌన్స్ కేసు కూడా నడుస్తోందని హేమ తెలిపారు.
ఆరోపణలు ఖండించిన జీవితారాజశేఖర్
తనపై వచ్చిన ఆరోపణలను జీవితా రాజశేఖర్ ఖండించారు. మాపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్ని విషయాలు విలేఖరుల సమావేశంలో వెల్లడిస్తానన్నారు. తాను పూర్తి ఆధారాలతో స్పందిస్తానని జీవితారాజశేఖర్ తెలిపారు.